News

విజయవాడలో ‘కృష్ణవేణి సంగీత నీరాజనం’

245views

కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ, సంగీత నాటక అకాడమీ, రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ సంయుక్తంగా వచ్చే నెల 6 నుంచి 8 వరకు విజయవాడలో ‘కృష్ణవేణి సంగీత నీరాజనం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ తెలిపారు. . విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో వైభవంగా నీరాజన కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వివరించారు. ఆంధ్రుల సాంస్కృతిక వైభవం, వారసత్వం, సంప్రదాయాలతోపాటు రాష్ట్రంలోని ప్రఖ్యాత వంటకాలు, హస్తకళలు, చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం కల్పిస్తున్నట్లుగా పేర్కొన్నారు. కర్ణాటక సంగీత, ఇతర పలు రకాల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అన్నారు.