
246views
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 28 నుండి డిసెంబర్ 6వ తేది వరకు జరగనున్న కార్తిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నవంబరు 26న మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది. 25వతేదీ ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహిస్తారు. ఆ తరువాత కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపడతారు. ఇందులోభాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజలసేవను టిటిడి రద్దు చేసినట్లు టిటిడి ఆ ప్రకటనలో తెలిపింది. అదే విధంగా నవంబర్ 26 నుంచి డిసెంబర్ 8 వరకు అన్ని ఆర్జిత సేవలు, కుంకుమార్చన, వేదాశీర్వచనం, విఐపి బ్రేక్ దర్శనాలను టిటిడి రద్దు చేసింది.





