
273views
సనాతన ధర్మంలో భాగంగా హిందూ ధర్మం పెంపొందించడానికి పశ్చిమ గోదావరి జిల్లా శనివారం మండలంలోని భీమలాపురం, వల్లూరుకు చెందిన సుమారు 500 మంది కోలాట భజన సభ్యులతోపాటు మరికొంత మంది హిందూభక్తులు కలిసి భారీ ర్యాలీగా అప్పన్నప్పల్లికి పాదయాత్రగా తరలివెళ్లారు. కోలాట భజన చేస్తూ ఉత్సాహంగా అప్పన్నపల్లి వెళ్ళి స్వామిని దర్శించుకున్నారు. పాదయాత్రలో ఎమ్మెల్యే పితాని తనయుడు వెంకట్‌తో పాటు ఎంపీపీ దిగుమర్తి సూర్యకుమారి, రెండు గ్రామాల సర్పంచ్‌లు నేలపూడి బేబి, గుబ్బల మాధవరావు, తాళం శ్రీనివాస్, దేవళ్ళ రమేష్, తోట ఆదినారాయణ, ఏడిద శ్రీనివాస్, మీరయ్య, గుబ్బల పాపారావు, తదితరులు ఉన్నారు.





