NewsProgramms

నంద్యాలలో ఘనంగా భజన బృందాల సమ్మేళనం

1.9kviews

ర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో 22 9 2019 ఆదివారం ఉదయం 8:00  గంటలకి సంజీవ నగర్ లోని శ్రీ కోదండ రామాలయం ఆవరణలో భజన బృందాల సమ్మేళనం నిర్వహించబడినది. గన్నవరంలోని శ్రీ భువనేశ్వరీ పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామి వారి దివ్య హస్తములతో ప్రారంభమైన ఈ సమ్మేళనంలో 10 మండలాల నుండి 30 భజన బృందాలు మరియు వేలాదిగా భక్తజనులు కదలివచ్చారు . ఆర్ ఎస్ ఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షులు డాక్టర్ కె ఉదయ్ శంకర్ అధ్యక్షతన ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా  రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణ రెడ్డి, శ్రీ భగవాన్ సేవా సమాజ్ ఉపాధ్యక్షులు శ్రీ పద్మనాభయ్య, కర్నూలు జిల్లా ధర్మ జాగరణ సమితి ప్రముఖ శ్రీ రామ్ ప్రసాద్ పాల్గొన్న ఈ సభలో శ్రీశ్రీశ్రీ కమలానంద భారతీ స్వామి అనుగ్రహ భాషణం చేశారు.

 “కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హిందూ జాతి మనది. సాక్షాత్తు ఆ భగవంతుడే ఈ భూమిలో జన్మించి ప్రతి యుగంలోనూ ధర్మరక్షణ చేస్తూ వచ్చారు. హిందుత్వానికి ఆధారం ధర్మం. పిలిచిన పలికే దైవం మన భగవంతుడు. సాక్షాత్తు పరమేశ్వరుని, కనకదుర్గను ప్రత్యక్షంగా దర్శనం చేసుకుని సంభాషించిన శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద ఉదంతం  మనసు తెలిసిందే. భగవంతుని నీవు చూస్తే ఆ భగవంతుడు నిన్ను చూస్తాడు. ఈనాడు tv మరియు సెల్ఫోన్ల మాయలో పడి మన భారతీయ ఇతిహాసాలయిన రామాయణ భారత భాగవతాలు, భగవద్గీత మర్చిపోవడం వల్ల మన కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతున్నది. అనాదిగా దేవాలయం కేంద్రంగా హిందూ సమాజం సంఘటితమై పరస్పర సహాయ సహకారాలతో, బంధువులతో కలివిడిగా జీవించేవారు. ఈ రోజు మన దేవాలయాలు సమాజానికి అందించవలసిన విలువలను అందించటంలో విఫలమై వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. ఆ కారణంగా ప్రజలలో దేవాలయాల పట్ల భక్తి శ్రద్ధలు తగ్గిపోతున్నాయి. ధర్మ జాగరణ ద్వారా మాత్రమే మనం మన కుటుంబం వ్యవస్థని రక్షించుకోగలుగుతాం హిందువులంతా ఐక్యంగా మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుంటూ విదేశీ మతాల నుండి మన ధర్మాన్ని, మన దేశాన్ని కాపాడుకోవలసిన అవసరం చాలా ఉంది.” అని స్వామీజీ పేర్కొన్నారు.

సాయంత్రం 5 గంటలకు వేలాది ప్రజలతో నగరంలో సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. సీతారామలక్ష్మణ ఆంజనేయ వేషధారులు, తమ సంప్రదాయ దుస్తులతో లంబాడీ యువతులు ముందు ఉండగా అందరూ భజన, కీర్తనలు సాగిస్తూ నగరమంతా తిరిగారు. ఈ నగర సంకీర్తన ప్రజలందరినీ విశేషంగా ఆకట్టుకుంది. సాయంత్రం 6 గంటలకు జరిగిన సభలో డాక్టర్ కె ఉదయ్ శంకర్ అధ్యక్షత వహించగా నంద్యాల నగరంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీమతి నర్మద జ్యోతి ప్రజ్వలన గావించారు.

 భజన బృందాలు భక్తిని శక్తిగా మార్చుకుని హిందూ సమాజాన్ని విదేశీ మతం నుంచి రక్షించుకోవాలని, మన కుటుంబంలో మన పిల్లలకు మన సంస్కృతీ సంప్రదాయాలను పరిచయం చేసి వారికి చక్కటి విలువలను నేర్పించడం ద్వారా మన ధర్మాన్ని, దేశాన్ని రక్షించుకోవాలని ఆరెస్సెస్ ప్రాంత ధర్మజాగారణ ప్రముఖ్ శ్రీ తిరుపతయ్య సభ్యులకు మార్గదర్శనం చేశారు. మతాంతరీకరణ వల్ల మన దేశం మూడు ముక్కలవడమే కాక ఈశాన్య భారతంలో జాతి వ్యతిరేక శక్తులు తల ఎత్తి సవాలు విసురుతున్నాయని, మనం అప్రమత్తంగా లేకపోతే చివరికి మన గ్రామంలో మనం మన పండుగలు చేసుకోలేని దుస్థితి వస్తుందని వారు ఉదాహరణలతో వివరించారు. మతం మారిన ఒక వ్యక్తి వలన రాయచోటి సమీపంలోని ఒక గ్రామంలోని హిందువులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. మనమంతా  అప్రమత్తంగా ఉండి మతాంతరీకరణల నుండి మన సోదరులను రక్షించుకోటమే కాక, మతం మారిన మన సోదరులందరినీ తిరిగి స్వధర్మంలోనికి తీసుకు వచ్చే బాధ్యతను నిర్వర్తించాలన్నారు.

 పోటీలో పాల్గొన్న బృందాలన్నిటికీ జ్ఞాపికలను అందించటం తోపాటు SC, ST కాలనీల నుండి ప్రత్యేకంగా ఆహ్వానించబడిన భజన బృందాలకి ప్రత్యేకంగా జ్ఞాపికలు అందజేశారు. మొదటి ఐదు స్థానాల్లో గెలుపొందిన భజన బృందాలకు భజన పరికరాలను అందజేశారు.

నంద్యాల జిల్లా ధర్మజాగరణ ప్రముఖ్ శ్రీ చంద్రశేఖర్ స్వాగత వచనాలతో  ప్రారంభమైన సభ కర్నూలు విభాగ్ ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ రాం ప్రసాద్ ధర్మ జాగరణ పరిచయంతో కొనసాగి నంద్యాల జిల్లా ధర్మజాగారణ పరియోజన ప్రముఖ్ శ్రీ మధుసూదన్ వందన సమర్పణతో ముగిసింది.

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి శ్రీ చింతల పల్లె వాసులు, శ్రీమతి విజయశ్రీ, శ్రీ హథీరామ్ నాయక్, శ్రీ చంద్రశేఖర్, శ్రీ మద్దిలేటి స్వామి, శ్రీ చంద్ర నాయక్, శ్రీ సురేష్ మధుసూదన్, శ్రీ తుమ్మల పుల్లయ్య మొదలైన  ధర్మజాగరణ జిల్లా, నగర సభ్యులు కృషి చేశారు.

శ్రీమతి విజయశ్రీ గారి శాంతి పాఠంతో ముగిసిన భజన బృందాల సమ్మేళనం నంద్యాల జిల్లా నుండి విచ్చేసిన అనేక గ్రామాల ప్రజలకు స్ఫూర్తిగా నిలిచింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.