
336views
కార్తీక మాసంలో త్రిలింగ దర్శనం పేరుతో తాడిపత్రి బుగ్గరామలింగేశ్వరస్వామి, యాగంటి, మహానంది క్షేత్రాల సందర్శనకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పుట్టపర్తి ఆర్టీసీ ఆర్‌ఎం మధుసూదన్ తెలిపారు. బస్సుల నిర్వహణపై ట్రాఫిక్, గ్యారేజ్, ఆర్‌ఎం కార్యాలయం సిబ్బందితో ఆయన సమీక్షించారు. నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకూ ప్రతి సోమవారం జిల్లాలోని అన్ని డిపోల నుంచి ఉదయం 5 గంటలకు బస్సులు బయలుదేరి, తిరిగి సాయంత్రం ఆయా డిపోలకు చేరుతాయన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సర్వీసులు పెంచుతామన్నారు. 40 మంది భక్తులు ఒక గ్రామం నుంచి వెళ్లాలనుకుంటే ఆ గ్రామం నుంచే బస్సు ఏర్పాటు చేస్తామన్నారు. ఆన్‌లైన్ ద్వారా రిజర్వేషన్ సదుపాయంతో పాటు సమీప బస్‌స్టేషన్, ఏటీబీ ఏజెంట్ల వద్ద కూడా రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.





