NewsProgramms

నంద్యాలలో సంఘ్ విజయదశమి ఉత్సవం

96views

నంద్యాల జిల్లాలోని స్థానిక శ్రీ రామకృష్ణా డిగ్రీ కాలేజి ఆవరణలోని వివేకానంద ఆడిటోరియంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవమైన విజయదశమి ఉత్సవం స్ఫూర్తిదాయకంగా జరిగింది.జిల్లా సంఘచాలక్ చిలుకూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన సభలో ముఖ్య అతిథిగా విశ్రాంత ఆంధ్రా బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శివ నాగిరెడ్డి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన వక్త ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత కార్యకారిణీ సభ్యులు యుగంధర్ జీ మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గడిచిన 99 సంవత్సరాలలో అధిగమించిన ఎత్తుపల్లాలను వివరించి ‌సమాజాన్ని సమైక్యంగా, సచేతనంగా, సర్వ సన్నద్ధంగా ఉంచాల్సిన అవసరాన్ని గురించి తెలియజేశారు. దేశాన్ని కబళించడానికి నిరంతరం కుట్రలు పన్నుతున్న విద్రోహుల గురించి బయటి శత్రువులతో పాటు మన మధ్యనే ఉన్న ప్రచ్ఛన్న శత్రువుల గురించి జాగరూకతతో ఉండాల్సిన అవసరాన్ని తెలియజేశారు. మన సమాజంలోని వికృతులను కూడా ఎప్పటికప్పుడు సరిచేయాల్సిన బాధ్యత కూడా మనదేనని తెలిపారు‌

ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, జ్యేష్ట కార్యకర్తలు, స్వయం సేవకులతో కలిపి మొత్తం 243 మంది పాల్గొన్నారు

ప్రార్థన అనంతరం ఉపస్థితులందరి ఆయుధపూజతో కార్యక్రమం సంపన్నమైనది.