News

సంఘమిత్ర ఆధ్వర్యంలో అభ్యాసిక ప్రారంభం

71views

స్థానిక బుడగ జంగం కాలనీలో సంఘమిత్ర ఆద్వర్యంలో అభ్యాసిక(ఉచిత ట్యూషన్ సెంటర్) ప్రారంభమైంది. శ్రీ సుందర రావు అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదులుగా గ్రామ పెద్దలు శ్రీ సుంకన్న, శ్రీ పెద్థస్వామి, శ్రీ కుళ్ళాయప్ప విచ్చేశారు. శ్రీ కుళ్ళాయప్ప మాట్లాడుతూ పిల్లలు చిన్నతనంలోనే సమాజ సేవ, జీవన విలువలు అలవర్చుకోవాలని తెలిపారు. సంఘమిత్ర కార్యదర్శి చిలుకూరి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, సంస్కృతి, సంప్రదాయాలు అలవర్చుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీమతి విజయశ్రీ, శ్రీమతి వెంకటేశ్వరి, శ్రీ గంగాధర్ , అభ్యాసిక ఉపాద్యాయురాలు సుమంజలి తో పాటు50 మంది చిన్నారులు తరగతులకు హాజరయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.