ArticlesNews

చేతికి కాశీతాడు తీసెయ్, హలాల్ మాంసం తిను, పేరు మార్చుకో

294views

ఇంగ్లండ్‌ పశ్చిమ లండన్‌ హోన్‌స్లో ప్రాంతంలోని స్ప్రింగ్‌వెల్ స్కూల్‌ ముగ్గురు ముస్లిం విద్యార్ధులను నిన్న శుక్రవారం సస్పెండ్ చేసింది. కారణం, వారు తమ పాఠశాలలో చదువుతున్న ఏడేళ్ళ హిందూ విద్యార్ధిని మతం మార్చడానికి ప్రయత్నించడమే. ముస్లిం పిల్లలు హిందూ మిత్రుణ్ణి బ్రెయిన్‌వాష్ చేసి, అతని పేరు మార్చుకునేలా చేసారు. ఆ అబ్బాయి తన చేతికి కట్టుకున్న కాశీతాడును కత్తెరతో కత్తిరించేసారు. అతను శాకాహారి అని తెలిసీ, హలాల్ చేసిన మాంసాహారం తింటే బలంగా తయారవుతావని నమ్మబలికారు.

ఈ విషయం కొంచెం ఆలస్యంగా, ఆ విద్యార్ధి తల్లిదండ్రులు తమ పిల్లాడి ప్రవర్తనలో మార్పును గమనించిన తర్వాతే వెలుగు చూసింది. ఒకరోజు పాఠశాల నుంచి ఇంటికి వచ్చాక ఆ పిల్లవాడు ప్రవర్తించే తీరు అసాధారణంగా ఉండడంతో వారికి అనుమానం వచ్చింది. వాకబు చేస్తే, ముస్లిం స్నేహితులు అతన్ని మతం మారేలా ప్రోత్సహిస్తున్నారని అర్ధమైంది. మతం మారకపోతే అతనితో మాట్లాడబోమని, స్నేహం కూడా కొనసాగదనీ వారు బెదిరించారని తెలిసింది.

విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు క్లాస్‌టీచర్‌తో మాట్లాడారు. మొదట టీచర్ ఆ వ్యవహారాన్ని, కొత్త విషయాలు తెలుసుకోవాలనే చిన్నపిల్లల కుతూహలం అంటూ కొట్టిపారేసింది. అయితే ఆ విద్యార్ధి తల్లిదండ్రులు ఊరుకోలేదు. ముస్లిం విద్యార్ధుల కార్యకలాపాల గురించి ఆరా తీసారు. ‘‘మేం ఏ మతాన్నయినా గౌరవిస్తాం. అది కాదు సమస్య. వారికి ఇలా చేయాలని ఎవరు నేర్పిస్తున్నారు? తల్లిదండ్రులా లేక ఇంకెవరైనానా? దానిగురించే మా ఆందోళన’’ అని చెబుతున్నారు. తమ పిల్లవాడి మతాన్ని మార్చడానికి ముస్లిం విద్యార్ధులు ఎందుకు ప్రయత్నిస్తున్నారో అన్న సంగతి ఆందోళన కలిగిస్తోంది.

ఆ మైనర్ బాలుడు తన పేరు ముహమ్మద్‌గా మార్చుకుంటానని తన తల్లికి చెప్పడంతో విషయం మరింత ఆందోళనకరంగా మారింది. ‘‘ఆ మధ్యాహ్నం నేను పనిలో ఉన్నాను. నా భార్య ఫోన్ చేసింది. మన అబ్బాయి తన పేరు మొహమ్మద్‌గా మార్చుకుంటాను అంటున్నాడని చెప్పింది. ఆ మాటలు వినగానే షాక్ అయిపోయాను. అసలు వాడికి ఆ ఆలోచన ఎక్కడిదో అర్ధం కాలేదు. మేం ఇంట్లో ఏ మతం గురించీ మాట్లాడుకోము. మా సొంత మతం గురించి కూడా’’ అని పిల్లవాడి తండ్రి చెప్పాడు.

ఆ తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని కలిసి, విషయం చెప్పారు. పాఠశాల కూడా జరిగిన విషయాన్ని గుర్తించారు. ఆ బాలుడు తన మతం మార్చుకోకపోతే స్నేహితులను కోల్పోవలసి వస్తుందని తరగతిలోని ముస్లిం విద్యార్ధులు బెదిరించారని విచారణలో తేలింది. దాంతో యాజమాన్యం ఆ విద్యార్ధులను సస్పెండ్ చేసింది.