News

భారత సరిహద్దు పొడవునా ఎస్ ఎస్ జీ కమాండోలను మోహరించిన పాక్ – దేనికైనా సై అంటున్న భారత సేనలు

594views

పొరుగు దేశం పాకిస్థాన్ దిక్కు తెలియని స్థితిలో ఏవేవో చేస్తోంది. పాకిస్థాన్ జమ్మూ కాశ్మీర్ లోని నియంత్రణ రేఖ నుంచి గుజరాత్ తీర ప్రాంతంలోని సర్ క్రీక్ వరకు పెద్ద ఎత్తున స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ (ఎస్ ఎస్ జీ) కమాండోలను మోహరించింది. పాక్ సరిహద్దుల వెంబడి ఇంత పెద్ద ఎత్తున కమాండోలను మోహరించడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. దీంతో పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. “పాక్ బారత్ తో యుద్ధానికి తెగబడుతోందా?” అన్న సందేహాన్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరేమో జైషే మొహమ్మద్ ఉగ్రవాదులను సరిహద్దులు దాటించే ప్రయత్నాలలో భాగంగానే ఈ విధంగా కమాండోలను మొహరించినట్లుగా భావిస్తున్నారు. భారత సైన్యం ఈ పరిణామాలన్నిటినీ నిశితంగా పరిశీలిస్తోంది. తాము మాత్రం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నామని మన సైనిక వర్గాలు వెల్లడించాయి.