
కర్నూలు జిల్లా, నంద్యాల సంఘమిత్ర విద్యార్థులు చదువులో నే కాదు సాంప్రదాయ కళలలో కూడా తమ ప్రతిభను చాటారు.
భగవాన్ శ్రీ కృష్ణుని జయంతిని పురస్కరించుకొని స్థానిక యాదవ సంఘం పెద్దలు నిర్వహించిన నృత్య, భగవత్ గీత శ్లోక పఠన మరియు వ్యాసరచన పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచారు.
సామూహిక నృత్య పోటీలో ప్రథమ బహుమతి గా కాంస్య విగ్రహాన్ని గెలుపొందారు. శ్లోక పఠనంలో చి. యస్. భాస్కర్ కు ప్రథమ, వ్యాసరచన లో చి. కె. రవికి ప్రోత్సాహక బహుమతులు లబించాయి.
శ్రీ సరస్వతి విద్యా పీఠం అధ్యాపకులు బాల బాలికలలోని నైపుణ్యాలను బాల్యంలోనే గుర్తించి వారిలో ఆవిష్కరణ నైపుణ్యాలను పెంపొందించడం కోసం జ్ఞాన విజ్ఞాన మేళా నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా శ్రీ భారతీ విద్యామందిర్ ఆళ్లగడ్డలో నిర్వహించిన జిల్లా స్థాయి మేళాలో జోనల్ స్థాయి విజేతలు తమ విజయ పరంపరను కొనసాగించారు.

సైన్స్ ప్రయోగాలలో చి. రోహిత్, గణిత ప్రయోగాలలో చి. సురేంద్ర, పత్రికా సమర్పణలో చి. సుభాష్, కథా కథనం లో చి. భాస్కర్ లు ద్వితీయ బహుమతులు సాధించారు.
ఆవాసం నందు ఉపాధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ పాండే గారి అధ్యక్షతన జరిగిన అభినందన సభలో కార్యదర్శి శ్రీ చిలుకూరు శ్రీనివాస్ గారు, ఉపాధ్యక్షులు శ్రీ జీనపల్లి వెంకటేశ్వర్లు గారు, కమిటి సభ్యురాలు శ్రీమతి వెంకటేశ్వరి గారు పాల్గొని విజేతలైన విద్యార్థులను ప్రోత్సహించిన ఆవాస్ ప్రముఖ్ గంగాధర్ ను అభినందించారు.
ఈ ఒరవడిని ఇంకా ఉదృతంగా కొనసాగించి తమ ప్రతిభను చాటాలని ఉద్బోధించారు.





