News

22 మంది అవినీతి అధికారులపై వేటు వేసిన కేంద్ర ప్రభుత్వం.

887views

వినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 22 మంది సీనియర్‌ అధికారులపై కేంద్ర ప్రభుత్వం వేటు వేసింది. తక్షణమే వారు తమ ఉద్యోగాలకు స్వచ్ఛంద విరమణ చేయాలని కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు(సీబీఐసీ) ఆదేశించింది. వీరంతా సుపరింటెండెంట్‌/ఏవో ర్యాంక్‌కి చెందిన అధికారులు కావడం గమనార్హం. నిబంధన 56(జే) ఆధారంగా వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు సబీఐసీ వివరించింది. ‘పన్నుల విభాగంలో కొంత మంది అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నార’ని స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ఎర్రకోట వేదికగా ప్రస్తావించిన విషయాన్ని సీబీఐసీ తన ఉత్తర్వుల్లో గుర్తుచేసింది.

వృత్తిరీత్యా తప్పుడు ప్రవర్తన కారణంగా గతంలో 27 మంది సీనియర్‌ అధికారులపై వేటు వేసిన విషయం తెలిసిందే. ‘ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రాజ్యాంగంలోని ప్రత్యేకాధికారాలతో భారత రెవెన్యూ సర్వీస్‌లో పనిచేస్తున్న 15 మంది సీనియర్‌ ఉద్యోగుల తక్షణ పదవీ విరమణకు రాష్ట్రపతి ఆదేశించారు’ అని అప్పట్లో ఆర్థిక శాఖ పేర్కొంది.

వేటు పడిన వారిలో సీజీఎస్టీ నాగ్‌పూర్‌, భోపాల్‌, చెన్నై, బెంగళూరు, దిల్లీ, జైపూర్, కోల్‌కతా, మేరఠ్‌, చండీగఢ్‌ జోన్లకు చెందిన పలువురు సీనియర్‌ అధికారులు ఉన్నారు. అలాగే బెంగళూరు, ముంబయి జోన్లకు చెందిన కస్టమ్స్‌ అధికారులు ఉన్నారు.