
అతి ప్రాచీనమైన సాహిత్య కళ అవధాన ప్రక్రియ అని విశాఖలోని మౌనానంద తపోవన ఆశ్రమానికి చెందిన రామానంద భారతి స్వామి అన్నారు.శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం, సుమిత్రా కళాసమితి సంయుక్త నిర్వహణలో వైజయంతి ఉత్సవ మండపంలో ద్విశతావధాన కళావిలాస కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్వామీజీ ద్విశతావధాన సభలో పాల్గొని అనుగ్రహణ భాషణం చేశారు. సభాధ్యక్షులు పార్వతీపురం సూర్యపీఠాధిపతి వేమకోటి నరహరి శాస్త్రి మాట్లాడుతూ అవధాన ప్రక్రియలో పాల్గొన్న అవధాని అపర్ణ ఎంతో పాండిత్యం పొందిన వారని కొనియాడారు. అనంతరం బులుసు అపర్ణ అన్ని ప్రశ్నలకు పూరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ కమీషనర్ ఎస్.చంద్రశేఖర్, సమితి అధ్యక్షులు ఇప్పిలి శంకరశర్మ, డాక్టర్ పులంఖడం శ్రీనివాసరావు, బంకుపల్లి రమేశ శర్మ, మండవిల్లి రవి, చిన్నారావు, నక్క శంకరరావు, కె.సురేష్, బంకుపల్లి శంకరం, వరలక్ష్మీ, పూజ, మల్లెమొగ్గల రాజు తదితరులు పాల్గొన్నారు.





