News

అక్రమ కబేళాలు నిర్వహిస్తే చర్యలు

344views

కాకినాడ జిల్లా పిఠాపురంలో అక్రమ కబేళాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ ఆర్‌డీవో ఇట్ల కిషోర్‌ హెచ్చరించారు. ఆయన మంగళవారం నియోజకవర్గంలో అక్రమ కబేళాలు, పశు రవాణా, విక్రయాలకు సంబంధించి రెవెన్యూ, పంచాయతీ, పశుసంవర్థక, పోలీస్‌ శాఖలతో పిఠాపురం మున్సిపల్‌ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో అక్రమ కబేళాలు నిర్వహిస్తున్నారంటూ ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించామన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి వాటిని నిర్వహించకూడదన్నారు. వీటిని అరికట్టడానికి గ్రామస్థాయిలో రెవెన్యూ పంచాయతీ, పశుసంవర్థక, పోలీసుశాఖ సిబ్బంది సమన్వయంతో చర్యలు చేప్టటాలని ఆదేశించారు.