News

బయట నుంచి చూస్తే కప్‌బోర్డ్‌.. లోపల ఉగ్ర స్థావరం

242views

జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఉగ్రవాదులు బంకర్లు ఏర్పాటుచేసుకొన్నట్లు జవాన్లు గుర్తించారు. ఓ ఇంట్లో ఉన్న కప్‌బోర్డ్‌లోపల ఉగ్రవాదులు పూర్తిగా కాంక్రీట్‌తో బంకరు నిర్మించినట్లు సైనిక వర్గాలు చెబుతున్నాయి. చిన్నదిగా ఉన్నా సౌకర్యవంతంగా ఉన్నట్లు పేర్కొంది. దీనిలోకి వెళ్లడానికి బయట నుంచి చిన్న అల్మారా వంటి దానిలో ద్వారం ఏర్పాటుచేశారు. ఒక మనిషి పాక్కొంటూ బంకర్‌లోకి ప్రవేశించవచ్చు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ నేత ఒకరు ఎక్స్‌లో పోస్టు చేశారు.

కొన్నేళ్ల క్రితం ఉగ్రవాదులు మరుగుదొడ్ల కింద బంకర్లు ఏర్పాటు చేసుకొంటున్నట్లు సైన్యం గుర్తించింది. దీంతో వాటిపై దృష్టిపెట్టింది. 2019లో లస్సీపుర వద్ద సైన్యం ఒక ఇంటిని అనుమానంతో ఆరుసార్లు తనిఖీ చేసినా ఏ ఆధారం దొరకలేదు. చివరికి సెప్టిక్‌ ట్యాంక్‌ను తెరవగా.. ఇద్దరు ఉగ్రవాదులు అందులోని బంకర్‌లో దాక్కొన్నట్లు గుర్తించారు. చాలా స్థావరాలు కిచెన్లు, బెడ్‌రూమ్‌లు, డ్రాయింగ్‌ రూమ్‌ల మాటున ఉంటున్నట్లు గమనించారు.