
263views
ఇంగ్లీష్ ఛానల్‌ను ఈదిన మొదటి భారతీయ తల్లిగా మహారాష్ట్రలోని నాశిక్‌కు చెందిన తన్వి చవాన్ దెవరె(33) రికార్డ్ సృష్టించారు. యూకేలోని డోవర్ నుంచి ఫ్రెంచ్ తీరం వరకు 42కిమీల దూరాన్ని తన్వి 17 గంటల 42 నిమిషాల్లో పూర్తి చేశారు. జూన్ 29 ఉదయం 8గంటలకు ఈదడం ప్రారంభించిన ఎలాంటి విశ్రాంతి లేకుండా పూర్తి చేశారు. తన్వికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో ఇంగీష్ ఛానల్‌ను ఈదిన మొదటి భారతీయ తల్లిగా నిలిచారు. ఇంగ్లాండ్- ఫ్రాన్స్‌ను వేరు చేసే ఇంగ్లీష్ ఛానల్‌ను ఈతడం ప్రపంచంలోనే అత్యంత కష్టమైన వాటిల్లో ఒకటి. ఈ ఘనతను సాధించేందుకు ప్రతిరోజూ 8-10 గంటలు ప్రాక్టిస్ చేస్తూ ఉండేదని తన్వి పేర్కొన్నారు. 16డిగ్రీల సెల్సియస్ చల్లటి నీటిలో ప్రయాణాన్ని మొదలు పెట్టినప్పుడు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాని, మధ్యలో జెల్లీ ఫిష్‌లు కూడా కుట్టేవని అన్నారు.





