News

బందరు నుంచి అయోధ్యకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

120views

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మొట్టమొదటిగా అయోధ్య బాల రాముడి దర్శనం కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు సీనియర్ డిపో మేనేజర్ పెద్దిరాజు ప్రారంభించారు. ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలను అందిస్తూ ఎప్పటికప్పుడు ప్రయాణికుల సంక్షేమం కోసం నిరంతరం ఆర్టీసీ పనిచేస్తుందని తెలిపారు. గతంలో శబరిమల వారణాసి వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రయాణికుల కోరిక మేరకు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. మచిలీపట్నం డివిజన్ ప్రజల కోరిక మేరకు ప్రత్యేక బస్సు సర్వీసులు అయోధ్య బాల రాముని దర్శనం కోసం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కేవలం అయోధ్య మాత్రమే కాకుండా సింహాచలం, అరసవెల్లి, శ్రీకూర్మం, కలకత్తా, గయా, కాశి అనంతరం అయోధ్య చేరుకుంటుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో అన్నవరం దర్శనం అనంతరం స్వస్థలానికి 11 రోజుల ప్రయాణంగా ఏర్పాటు చేయడం జరిగిందని మీడియాకి తెలియజేశారు. ప్రైవేటు ట్రావెల్స్ కన్నా మెరుగైన సేవలతో ప్రయాణికుల సంక్షేమానికి భద్రతకు ఆర్టీసీ కృషి చేస్తుందని, తక్కువ ఖర్చుతో టూర్ ప్యాకేజీలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. అదనంగా ప్రయాణికుల రద్దీ పెరిగినట్లయితే మరొక బస్సు సర్వీస్ కూడా ఏర్పాటు చేయడానికి ఆర్టీసీ సంసిద్ధంగా ఉందని తెలిపారు.