News

భారత్ లో వ్యాపారవేత్తలను గౌరవిస్తుంటే.. మనం మాత్రం ‘దొంగలు’ అంటున్నాం…. పాక్ మంత్రి

263views

భారత్ పై పాకిస్థాన్ నేతల నుంచి ప్రశంసలు రావడం ఇటీవల క్రమంగా పెరుగుతోంది. భారత్ చంద్రుడిపై అడుగు పెడుతుంటే.. మన బిడ్డలు అడుక్కుంటున్నారని పాక్ పార్లమెంటు సభ్యులు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇది జరిగిన మరుసటిరోజే పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహ్సిన్నఖ్వీ కూడా భారత్ తీరును కొనియా డారు. తమ దేశంలో వ్యాపారవేత్తలను దొంగలుగా చిత్రీకరిస్తుంటే… భారత్ మాత్రం అక్కడి వ్యాపారులకు పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. ఆ దేశ ప్రగతికి ఇదో కారణమంటూ ప్రశంసలు కురిపించారు.

భారత్ లో వ్యాపారవేత్తలకు గౌరవం ఉంటుంది. ప్రభుత్వం వారికి మద్దతుగా నిలుస్తుండటం ఆ దేశ పురోగతికి ఓ కారణం. కానీ, పాకిస్థాన్ లో మాత్రం ఓ వ్యాపారవేత్త ఎదుగుతుంటే.. వారిని దొంగ అని ముద్ర వేస్తారు. ఓ వ్యాపారవేత్తగా.. నా డబ్బును నాకు నచ్చినచోట పెట్టుబడి పెడతా. నా భార్యకూ లండన్ లో ఆస్తులున్నాయి. అక్కడ వాటికి పన్నులు కూడా చెల్లించాం. విదేశాల్లో పెట్టుబడి పెట్టడంలో తప్పు లేదు. అక్రమంగా సంపాదించే ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టవచ్చు’ అని అన్నారు. పాక్ కు చెందిన పలు మీడియా సంస్థలకూ దుబాయ్ ఆస్తులు ఉన్నాయన్నారు.

వేరే దేశాల్లో డబ్బులు దాచుకుంటుంటే.. విదేశాల నుంచి పాకిస్థాన్ కు పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు.