News

తిరుమలలో పెరిగిన భక్తుల దర్శనానికి 24 గంటలు

474views

తిరుమలకు భక్తులు పోటెత్తారు. వేసవి సెలవుల దృష్ట్యా ఏడుకొండలపై ఎటు చూసినా భక్తజన సందోహం కనిపిస్తోంది. అనూహ్యంగా పెరిగిన రద్దీతో సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు భక్తులతో నిండిపోయి.. ఔటర్‌ రింగురోడ్డులో 3 కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. క్యూలైన్‌లలో వేచి ఉన్న భక్తులకు తితిదే సిబ్బంది తాగునీరు, అల్పాహారం అందిస్తున్నారు.