3views
తమిళనాడు మధురై జిల్లాలోని తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభంపై ఎట్టకేలకు దీపం వెలిగింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ, విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో సరిగ్గా 5 గంటలకు ఆలయ అర్చకులు దీపం వెలిగించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతమంతా మురుగున్ నినాదాలతో దద్ధరిల్లింది. ఈ అపురూప దృశ్యాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలిరాగా వారిని అదుపు చేసేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. కొండపైకి భక్తులు వెళ్లకుండా సీఆర్పీఎఫ్ బలగాలను భారీగా మోహరించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. వైద్యనాథన్, జస్టిస్ వి. పార్థిబన్ పర్యవేక్షణలో, తిరుపరన్కుండ్రం కొండపై ఉన్న ‘దీపత్తూన్’ వద్ద కార్తీక దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.





