News

ఏ నాగరిక సమాజంలోనూ హింసను కీర్తించరు

225views

కెనాడాలోని ఒంటారియోలో నిర్వహించిన ఊరేగింపులో ఖలిస్థానీ అనుకూల ప్రదర్శనలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. హింసను కీర్తించడం ఏ నాగరిక సమాజంలోనూ భాగం కాదని పేర్కొంది. నేర, వేర్పాటువాద శక్తులకు కెనడాలో సురక్షితమైన ఆశ్రయం కల్పించడాన్ని మానుకోవాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారప్రతి నిధి రణధీర్ జైశ్వాల్ మంగళవారమిక్కడ మాట్లాడారు. కెనడాలోని తన దౌత్య ప్రతినిధుల భద్రతపై భారత్ ఇప్పటికీ ఆందోళనగా ఉందన్నారు. ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా బాధ్యతలను నెరవేర్చుతామని కెనడా హామీ ఇస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.