ఉద్వేగం కలిగించకుండా, బాధించకుండా, ప్రియంగా మాట్లాడటం వాచిక తపస్సని సాక్షాత్తూ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ప్రబోధించాడు. మాటకి అధిదేవత ‘అగ్ని’ అనేది పురాణ వచనం. అగ్ని ఎంత ఉపయోగకరమో, అంత ప్రమాదకరం కూడా! కనుక వాక్కును నిప్పులా ఎంతో పదిలంగా, ప్రయోజనకరంగా ఉపయోగించుకునే విజ్ఞత ఉండాలి. యుద్ధంలో శరీరానికి తగిలిన బాణాలను ఎలాగైనా తొలగించుకోవచ్చు. కానీ మనసును గాయపరిచే కఠినమైన మాటల బాణాలను ఏ ఉపాయంతోనూ తొలగించలేమని మహాభారతం కూడా హితవు పలికింది. మనసు నొచ్చుకునేలా మాట్లాడటం హింసతో సమానమని హెచ్చరించింది. మన సభ్యత, సంస్కారం మాట్లాడే తీరులోనే బయటపడతాయని స్పష్టం చేసింది. దుర్భాషలాడటం, కసురుకోవటం, పెళుసుతనం, సూటిపోటీలు- ఇవన్నీ వాచిక తపస్సుకు ఆటంకాలు. ‘ఇతరుల మనసు నొచ్చుకునేలా భాషించకూడదు. ఆ ధోరణిని కొనసాగిస్తే చివరకు అదే నీ స్వభావం అయిపోతుంది. సున్నితత్వాన్ని కోల్పోతే నీ మాటలకు హద్దూ అదుపూ లేకుండా పోతుంది’ అన్నారు జనని శారదాదేవి. ‘మాటపై అదుపు లేదంటే, మనపై మనకు అదుపులేదని అర్థం. అది రాక్షసత్వానికి నిదర్శనం. కటువుగా మాట్లాడే వాళ్లు వేటగాళ్లతో సమానం. మానసికంగా బాధించడమూ హింసే. దానికి శిక్ష తప్పదు’ అని హెచ్చరిస్తున్నాయి ధార్మిక గ్రంథాలు.
538views
You Might Also Like
ఆలయ ప్రదక్షిణ : భక్తి, వినయం, అంతర్ముఖతకు ఆధ్యాత్మిక మార్గం
హిందూ ధర్మంలో ప్రతి ఆచారానికీ ఒక అంతరార్థం ఉంటుంది. ఆలయానికి వెళ్లడం, గర్భాలయ దర్శనం చేసుకోవడం, తీర్థప్రసాదాలు స్వీకరించడం, నమస్కరించడం వంటి ప్రతి సంప్రదాయమూ మనిషిని బాహ్య...
‘అద్వైతసిద్ధి’కి తెనాలి పరీక్ష
తెనాలి పరీక్ష". నేడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశ మైంది. ఇంతకీ ఏమిటీ పరీక్ష.. అంత కఠినంగా ఉంటుందా.. దేశం మొత్తమ్మీద ఒక్క తెనాలిలోనే ఎందుకు నిర్వహిస్తారు? ప్రధాని...
దయ చూపండంటున్నా.. మహిళకు షరియా శిక్ష 100 కొరడా దెబ్బలు
13
ఇండోనేషియాలోని వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళకు అక్కడి అధికారులు దారుణమైన శిక్ష విధించారు. అచే ప్రావిన్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. బహిరంగంగా శిక్ష అమలు చేస్తున్న సమయంలో...
ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు
11
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జరిగిన 10 కిలోమీటర్ల రన్నింగ్ రేసులో పలువురు మహిళలు తలపై హిజాబ్ లేదా స్కార్ఫ్ ధరించకుండా పాల్గొన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా...
శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోండి.. విద్యార్థులకు అజిత్ డోభాల్ పిలుపు
32
జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలని భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ డోభాల్ విద్యార్థులకు సూచించారు. ఇందుకోసం శ్రీరాముడి జీవితాన్ని ఆదర్శంగా...
పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
10
పాకిస్థాన్, తాలిబాన్ల మధ్య విభేదాలు మళ్లీ తీవ్ర రూపాన్ని దాల్చాయి. ఇటీవల పాకిస్థాన్‌లో జరిగిన ఒక భారీ తీవ్రవాద దాడి తర్వాత, ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్‌కు...





