News

హైందవ ధర్మంతోనే విశ్వశాంతి

253views

హైందవ ధర్మంతోనే విశ్వశాంతి సాకారం అవుతుందని ముంబయికి చెందిన అఖిల భారత వనవాసీ కల్యాణాశ్రమ అధికారి సోమయాజులు అన్నారు.అల్లూరి సీతారామ జిల్లా చింతపల్లి మండలంలోని పెదబరడ పంచాయతీ కృష్ణాపు రంలోని దామరాజు వెంకట రామయో గీశ్వర ఆశ్రమ నిర్వాహకులైన రామా నందస్వామి గత నెలలో సుమారు. 1600 కిలోమీటర్లు భక్తులతో కలసి పాదయాత్రగా వెళ్లి అయోధ్యలోని బాలరాముడిని దర్శించుకుని వచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం కృష్ణా పురం ఆశ్రమంలో ఏర్పాటు చేసిన – ఆధ్యాత్మిక కార్యక్రమంలో సోమయా జులు రామానందస్వామిని సత్కరిం
చారు. గురుదేవుల సంఘం అధ్యక్షులు మత్స్య రాజు, కార్యదర్శి సత్యనారాయణ, వనవాసీ, విశ్వ హిందూ పరిషత్, ఎస్ఎస్ఎఫ్, మండల జిల్లా రాష్ట్ర ప్రచారకు, భక్తులు, కార్యనిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.