News

ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులు పరిశీలించిన ఈవో

304views

శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులతో పాటు భక్తులకు దేవస్థానం అందిస్తున్న సేవలను ఈవో కె.ఎస్.రామరావు గురు వారం పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలోని మహా మండపం ఎదుట దేవస్థానం నిర్మిస్తున్న లడ్డూ పోటు, అన్నదాన భవనం పనులను పరిశీలించారు. కనకదుర్గనగర్ నుంచి మహా మండపానికి అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న క్యూకాంప్లెక్స్ పనులను ఈఈ లింగం రమాదేవిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మహా మండపం రెండు మూడు అంతస్తులోని అన్నప్రసాద వితరణ తీరును పరిశీలించారు. అమ్మవారి అన్నప్రసాదం స్వీకరిస్తున్న భక్తులతో ఈవో మాట్లాడారు. అన్న ప్రసాద నాణ్యత, ఇంకా మెరుగైన సేవలను కల్పించే దిశగా వారిని అడిగి తెలుసుకున్నారు. అన్నం నాణ్యతను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అన్నదానం స్వీకరించిన అనంతరం భక్తులు ఇచ్చే విరాళాలకు తగిన రశీదులు ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. విరాళాలు దుర్వినియోగం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.