News

మే 21 నుండి 29 వరకు జమ్మలమడుగు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

343views

వైయస్సార్ జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 21 నుండి 29వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 20వ తేదీన అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 30వ తేదీన సాయంత్రం 6 గంట‌లకు పుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

21-05-2024
ఉదయం – ధ్వజారోహణం
సాయంత్రం- పెద్దశేష వాహనం

22-05-2024
ఉదయం – చిన్నశేష వాహనం
సాయంత్రం- హంస వాహనం

23-05-2024
ఉదయం – ముత్యపుపందిరి వాహనం
సాయంత్రం- సింహ వాహనం

24-05-2024
ఉదయం – కల్పవృక్ష వాహనం
సాయంత్రం- హనుమంత వాహనం

25-05-2024
ఉదయం – పల్లకీ ఉత్సవం
సాయంత్రం- గరుడ వాహనం

26-05-2024
ఉదయం – సర్వభూపాల వాహనం
సాయంత్రం- కల్యాణోత్సవం, గజ వాహనం

27-05-2024
ఉదయం – రథోత్సవం
సాయంత్రం- అశ్వవాహనం

28-05-2024
ఉదయం – సూర్యప్రభ వాహనం
సాయంత్రం- చంద్రప్రభ వాహనం

29-05-2024
ఉదయం – చక్రస్నానం
సాయంత్రం- ధ్వజావరోహణం

మే 26వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. రూ.300/- చెల్లించి గృహస్తులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం ఒక అప్పం, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత కార్యక్రమం, హరికథాగానం, కోలాటాలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.