News

శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం

357views

మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్‌ హైకోర్టులో విచారణ కొనసాగింది. ఈద్గా మసీదును తొలగించాలన్న పిటిషన్‌ను సవాల్‌చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో హిందువుల తరఫు న్యాయవాది హరి శంకర్‌ జైన్‌ వాదనలు వినిపించారు. ప్రార్థనా స్థలాల చట్టం ఈ కేసుకు వర్తించదని తెలిపారు. శ్రీకృష్ణ ఆలయం రక్షిత కట్టడమని, ప్రాచీన నిర్మాణాలు, పురావస్తు స్థలాలు, అవశేషాల చట్టం-1958ను దీనికి వర్తింపజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆలయంలో పూజలు నిర్వహించడం భక్తుల హక్కని, ప్రార్థనా స్థలాల చట్టం దీనిని అడ్డుకోజాలదని తెలిపారు. జస్టిస్‌ మయాంక్‌ జైన్‌ ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది.