NewsSeva

నంద్యాల సంఘమిత్రలో రోటరీ క్లబ్ సహాయంతో ఉచిత హెపటైటిస్ బి వ్యాక్సిన్లు.

80views

వర్షాకాల ప్రవేశముతో ఆగష్టు 9 శుక్రవారం నాడు కర్నూలు జిల్లా నంద్యాల సంఘమిత్ర నిరాశ్రిత బాలుర ఆవాసము నందు ముందు జాగ్రత్త చర్యగా వ్యాది నిరోధకాలైన “హెపటైటిస్ బీ” టీకాలను ఉచితంగా వేయడం జరిగింది.

రోటరీ క్లబ్ 54 వ వార్షికోత్సవం సందర్బంగా క్లబ్ అధ్యక్షులు డా. విజయ భాస్కర్ రెడ్డి గారి వాగ్దానం మేరకు డా. యన్. భార్గవరెడ్డిగారు తమ సహాయ సిబ్బందితో వచ్చి ఆవాసం లోని విద్యార్థులందిరికి హెపటైటిస్ బీకి సంబంధించిన రక్త పరీక్ష జరిపి తరువాత వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది.

సంఘమిత్ర ఉపాధ్యక్షులు జీనపల్లె వెంకటేశ్వర్లు గారు మరియు ఆవాస ప్రముఖ్ గంగధర్ గారు డా. యన్. భార్గవ రెడ్డి గారికి వారి సిబ్బందికి మరియు రోటరీ క్లబ్ వారికి ధన్యవాదములు తెలిపారు.