ArticlesNews

నమ్మి వస్తే నరకం చూపించారు – పాకిస్థాన్ మొట్టమొదటి కార్మిక మరియు న్యాయశాఖా మంత్రి శ్రీ జోగేంద్రనాథ్ మండల్ అప్పటి ప్రధాని లియాఖత్ ఆలీఖాన్ కు పంపిన రాజీనామా లేఖ

249views

Click here to download/read the article

శ్రీ జోగేంద్రనాథ్ మండల్ (1904 – 1968) వంగ దేశస్థుడు. నేటి బంగ్లాదేశ్లో జన్మించారు. వంగ దేశపు మేథావులలో ఒకరు. దళిత నాయకులు. ముస్లిం లీగ్ కు సహకరించి బెంగాల్ విభజనకు, ఆతర్వాత దేశ విభజనకు షెడ్యూల్ కులాల వారి మద్దతును కూడగట్టారు. పాకిస్థాన్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించటం తోపాటు పాకిస్థాన్ రాజ్యాంగ సభకు అధ్యక్షుడిగా పనిచేశారు. పాకిస్థాన్ మొట్టమొదటి న్యాయ కార్మిక శాఖా మంత్రిగా రాజీనామా చేసేవరకు 1948 ఆగష్టు 15 నుండి అక్టోబర్ 8  1950 వరకు పనిచేశారు. కాశ్మీర్ వ్యవహారాలను సైతం పర్యవేక్షించారు. డాక్టర్ అంబేద్కర్ ముఖ్య సహచరులలో ఒకరు. బెంగాల్ నుండి అంబేద్కర్ రాజ్యాంగ సభకు ఎన్నికవటానికి సహకారం అందించారు. అంబేద్కర్ తో కలిసి బెంగాల్లో షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ ను నెలకొల్పారు. అయితే అంబేద్కర్ తో విభేదించి పాకిస్థాన్లోనే దళితులకు భద్రత, సమాన అవకాశాలు ఉంటాయని నమ్మి ముస్లిం లీగ్ కు, ఆ తర్వాత పాకిస్థాన్ కు తిరుగులేని మద్దతు ఇచ్చారు. పాకిస్థాన్ కు వలస వెళ్ళారు. మూడు సంవత్సరాల తర్వాత అక్కడి హిందువులు షెడ్యూలు కులాల వారిపై జరుగుతున్న అత్యాచారాలకు, అణచివేతకు గుండె పగిలి భారతదేశానికి తిరిగివచ్చారు. పాక్ ప్రధాని లియాఖత్ ఆలీఖాన్ కు 1950 అక్టోబరు 8 న తన రాజీనామా లేఖను పంపారు.

క్రింద ఇచ్చిన లింకులో ఆ లేఖ పూర్తి పాఠాన్ని తెలుసుకోగలరు.

Click here to download/read the article