News

శ్రీనగర్‌లో 10వేలమంది ఆందోళన నిర్వహించారని మీడియాలో వార్తలు – తప్పుడు కథనాలన్న హోం మంత్రిత్వ శాఖ

130views

ర్టికల్‌ 370 రద్దు చేస్తూ భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే..! అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా కర్ఫ్యూను విధించారు. కొన్ని రోజుల పాటూ కొనసాగిన కర్ఫ్యూను శుక్రవారం నాడు సడలించారు. దీంతో ప్రజలు ప్రార్థనలు నిర్వహించారు. అంతేకాకుండా శనివారం నాడు ప్రభుత్వ ఆఫీసులను, పాఠశాలలను తెరచారు.

అయితే కొన్ని మీడియా సంస్థలు మాత్రం శ్రీనగర్‌లో దాదాపు 10వేలమంది ప్రజలు గుమిగూడి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారని కథనాలను ప్రచారం చేశాయి. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత శ్రీనగర్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకున్నాయని, తమకు స్వేచ్ఛా కావాలని, ఆర్టికల్‌ 370 రద్దును అంగీకరించేది లేదని అన్నారని వార్తలు వెలువడ్డాయి. దీనిపై  కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఖండించింది. ఇవి అసత్య కథనాలని హోంశాఖ స్పష్టం చేసింది. ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ విభజన అనంతరం శ్రీనగర్‌, బారాముల్లా ప్రాంతాల్లో చిన్నపాటి ఆందోళనలు మినహా ఎలాంటి ఘటనలు జరగలేదని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

Source : Bharath Today.