
బీహార్ లోని మరో లవ్ జిహాద్ కేసు తెరపైకి వచ్చింది.తూర్పు చంపారన్‌లో ‘ది కేరళ స్టోరీ’ లాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. తూర్పు చంపారన్‌లో లవ్ జిహాద్ పేరుతో హిందూ యువతిని మోసం చేసి అక్రమంగా విక్రయించబోయిన ఘటన చోటుచేసుకుంది
బీహార్‌కు చెందిన ముస్లిం యువకుడు సమీర్ ఆలమ్ 17 ఏళ్ల హిందూ బాలికను అక్రమంగా తరలిస్తుండగా నేపాల్ రక్సాల్ సరిహద్దులో SSB దళం పట్టుకుంది.వారు చెప్పిన వివరాల ప్రకారం..
సమీర్ మొదట మైనర్ బాలికను తన అసలు మతపరమైన గుర్తింపును దాచి, హిందువునని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు.ఆపై బాలికను ప్రలోభపెట్టి నేపాల్‌కు తీసుకెళ్లి అక్కడ విక్రయించబోతుండగా SSB దళం అదుపులోకి తీసుకుంది. హిందూ బాలికలను బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తున్నట్లు సమీర్ ఆలమ్‌పై ఇప్పటికే అనేక కేసులు నమోదైయ్యాయని,
వీటిపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు.ఈ ఘటనపై హిందూ సంస్థలు స్పందిస్తూ ఇంకెంత కాలం హిందూ కుమార్తెలు లవ్ జిహాద్ బారిన పడాలని ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నాయి.

Source : Dainik Bhaskar





