News

సింహగిరిపై ఘనంగా పండిత సదస్సు

46views

సింహాచలంపై జరుగుతున్న శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం సాయంత్రం పండిత సదస్సును ఘనంగా నిర్వహించారు. స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వేణుగోపాలస్వామిగా అలంకరించి, దేవేరులతో కలిపి వేదికపై కొలువుదీర్చారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహించారు. అనంతరం రాష్ట్రంలోని పలు ప్రధాన దేవస్థానాల నుంచి వచ్చిన వేద పండితులు స్వామి వారి వైభవాన్ని చాటిచెప్పారు. అనంతరం దేవస్థానం తరఫున ఈవో ఎస్‌.శ్రీనివాసమూర్తి వారిని సత్కరించారు. రాష్ట్ర దేవదాయశాఖ అడిషనల్‌ కమిషనర్‌ చంద్రకుమార్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఇరగవపు రమణాచార్యులు, పురోహిత్‌ అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.