
ముఖ్యమైన సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగంగా మరో సంఘటన చోటు చేసుకుంది. కిషన్ గంగానది ఒడ్డున 75 సంవత్సరాల విరామం తర్వాత పురాతన గంగా హారతి సంప్రదాయాన్ని తిరిగి ప్రారంభించారు. ఉత్తర కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ LOCలో కిషన్‌గంగా ఒడ్డున దేశ విభజన తర్వాత తొలిసారిగా గంగా హారతి జరిగింది. కొత్తగా నిర్మించిన ఘాట్ వద్ద నిర్వహించిన పవిత్ర హారతి కార్యక్రమంలో దేశం నలుమూలల నుండి వచ్చిన భక్తులు కిషన్‌గంగలో విశ్వాసం నింపారు.
Kashmir: Ganga Aarti on the banks of River Kishanganga at Teetwal close to LoC in North #Kashmir's Kupwara district held for the first time yesterday after a gap of 75 years at the newly constructed Ghat.
Scores of pilgrims from all over the country took part in the event.
This… pic.twitter.com/oFra2ZXlpy
— Nishant Azad/निशांत आज़ाद???????? (@azad_nishant) April 11, 2024
విభజన తర్వాత తొలిసారిగా జరిగిన ఈ హారతి కార్యక్రమంలో శారదా మాత ఆలయ దర్శనానికి విచ్చేసిన యాత్రికులు పెద్ద ఎత్తున పాలుపంచుకున్నారు. తాజాగా ఘాట్ వద్ద ఆలయాన్ని మరోసారి పునరుద్ధరించారు.ప్రశాంతమైన నదీ జలాలు, గంభీరమైన పరిసరాల నేపథ్యంలో, గంగా హారతి పాల్గొనేవారిలో భక్తి భావాన్ని ప్రేరేపించింది.రానున్న రోజుల్లో భక్తుల రద్దీ పెరగనుందని స్థానికులు చెప్తున్నారు.





