News

భద్రాద్రి శ్రీరామ కల్యాణ వీక్షణకు టికెట్ల విక్రయం

256views

భద్రాచలం రామాలయంలో ఈ నెల 17న నిర్వహించే శ్రీరామనవమి కల్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించే భక్తులకు ఆన్‌లైన్‌తో పాటు కౌంటర్లలో టికెట్లను విక్రయిస్తున్నట్లు దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.7,500, రూ.2,500, రూ.2 వేలు, రూ.వెయ్యి, రూ.300, రూ.150 విలువైన టికెట్లు ఇప్పటికే భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా మిథిలా మండపానికి సమీపంలో విలువైన సెక్టార్లను(ప్రత్యేక విభాగాలను) ఏర్పాటు చేశామని, అందుకు సంబంధించిన రూ.10 వేలు, రూ.5 వేల టికెట్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం నుంచి విక్రయించనున్నట్లు వెల్లడించారు. కల్యాణ బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు వివరించారు.