News

శ్రీరాముని శోభాయాత్ర పోస్టర్‌ల ఆవిష్కరణ

342views

సనాతన ధర్మానికి ప్రతీక శ్రీరామ.. హనుమంతుడు రథయాత్రకు భారీగా తరలిరండి హిందూ ధర్మ గొప్పదనాన్ని చాటి చెబుదాం అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. శ్రీ రాముని చరితం అపూర్వం.. ప్రతి ఒక్కరికి ఆయన జీవితం ఒక పరమార్ధం.. ధర్మ పరిరక్షణ.. కోసం ఎంతటి త్యాగానికై నా వెనుకాడని నీలమేఘ శ్యాముడు.. ధర్మపోరాటానికి అండగా నిలిచి రాముని అడుగులో అడుగైన హనుమంతుడు సనాతన ధర్మానికి ప్రతీకలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ఈనెల 17వ తేదీన గుంటూరులో నిర్వహించనున్న శోభాయాత్రకు భారీ తరలివచ్చి సరికొత్త చరిత్రను సృష్టిద్దామని పిలుపునిచ్చారు.గుంటూరులోని బృందావన్‌గార్డెన్స్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం శోభాయాత్ర వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి విడదల రజిని మాట్లాడుతూ మాట్లాడుతూ శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ప్రణాళిక రూపొందించిన శ్రీరామ ఉత్సవ సమితికి అభినందనలు తెలిపారు. దాదాపు 50 వేలకుపైగా హిందువులు పాల్గొనేలా శోభాయాత్రను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తుండటం ప్రశంసనీయమన్నారు. శోభాయాత్రకు హిందువులంతా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. శ్రీరామనవమి రోజున గుంటూరులో పెద్ద ఎత్తున శోభాయాత్రను నిర్వహించనుండడం మనందరికీ ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఈ యాత్రకు అన్ని విధాలా తన సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు.

వైభవంగా శ్రీరామనవమి
శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహించుకుందాం అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ చెప్పారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్‌ మొహమ్మద్‌ముస్తఫా ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో శ్రీరామ ఉత్సవ సమితి నిర్వాహకులు అడపా ఫణీంద్ర, బ్రహ్మారెడ్డి, వేణుగోపాల్‌, ఆర్‌.కోటేశ్వరరావు పాల్గొన్నారు.