
278views
శ్రీసత్యసాయి జిల్లా కూడేరులో స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన కూడేరు శివపార్వతుల జోడు లింగాల సంగమేశ్వరుడి రథోత్సవం నిర్వాహణపై ఆదివారం ఆలయ ధర్మకర్త కిష్టప్ప అధ్యక్షతన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాబు గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 17 నుంచి 26 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించేలా ఆలయ పురోహితుడు శివశంకరశాస్త్రి నిర్ణయించారు. 23న రథోత్సవం నిర్వహించనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెలిపారు. త్వరలోనే బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను సిద్ధం చేస్తామన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు అలివేలమ్మ, శ్రీనివాసులు, శంకరరెడ్డి, గ్రామ పెద్దలు తిమ్మారెడ్డి, ఓబుళప్ప, ప్రవీణ్ స్వామి, మల్లికార్జున, రమేష్, వెంకటయ్య , సంగప్ప తదితరులు పాల్గొన్నారు.





