ArticlesNews

ప్రజల మధ్య అంతరాలు సృష్టించడానికే ప్రధానికి బాలీవుడ్ నటుల లేఖ – మేథావుల బృందం

367views

చయితలు, కళాకారులు, డాక్టర్లు, జర్నలిస్టులు, చరిత్రకారులు మరియు వైస్ ఛాన్సలర్లతో కూడిన 15 మంది మేథావుల బృందం, కొందరు బాలీవుడ్ నటులు, వామపక్ష మేథావులతో కూడిన బృందం ప్రధానికి వ్రాసిన బహిరంగ  లేఖను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. భారతదేశంలో అసహనం పెరిగిపోతోందని ఆరోపిస్తూ బాలీవుడ్ బృందం ప్రభుత్వానికి వ్రాసిన లేఖ దేశ ప్రజలలో అయోమయం సృష్టిస్తోందని, అంతర్జాతీయంగా భారత దేశ గౌరవాన్ని దెబ్బతీస్తోందని వారు ఆరోపించారు.

బాలీవుడ్ బృందాన్ని ఉద్దేశించి వ్రాసిన లేఖలో…

“ఆ విధంగా ప్రధానికి లేఖ వ్రాయడం వల్ల దేశంలోని సామరస్య వాతావరణం దెబ్బతింటుంది. ప్రధానిని ప్రత్యేకంగా విమర్శించడమే వారి ఉద్దేశ్యంగా ఉంది. మేము “సబ్ కా సాత్ – సబ్ కా వికాస్ – సబ్ కా విశ్వాస్”  సిద్ధాంతానికి మనఃస్పూర్తిగా సహకరించదలచుకున్నాము.

రాజకీయ ప్రేరితమైన ఒక ప్రత్యేక వర్గానికి చెందిన విభజనవాదులు “దేశంలో మూకదాడులు జరుగుతున్నాయని, అసహనం పెరిగిపోతోందం”టూ చేస్తున్న ఆరోపణలను మేం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. పూర్తి సమాచారం తెలుసుకోకుండానూ మరియు తప్పుడు సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చెయ్యటం ద్వారా కుహనా మేథావులు ఒక ప్రత్యేక వర్గాన్ని రెచ్చగొట్టడం కోసం ఇదంతా చేస్తున్నారని మేం నమ్ముతున్నాము.

గత ప్రభుత్వంలో దేశంలోని ఒక వర్గం ప్రజలపై మూక దాడులు జరిగిపోతున్నాయని, దేశంలో అసహనం పెరిగిపోతోందని గొంతు చించుకున్న దేశంలోని గొప్పవారైన, లబ్ద ప్రతిష్టులైన విద్యావేత్తలు, నాయకులు, మేథావులు, జర్నలిస్టులు, నటులు, వైద్యులు, న్యాయవాదులు అందరూ గుర్తించవలసిన విషయమేమిటంటే గడచిన ఎన్నికల్లో దేశ ప్రజలు ఇచ్చిన తమ విస్పష్టమైన తీర్పు ద్వారా ఇటువంటి వారు చేస్తున్న ప్రకటనల పట్ల తమ వైఖరేమిటో స్పష్టం చేశారన్న సంగతిని గ్రహిస్తే మంచిది.

వైవిధ్యంలో ఏకత్వానికి మన దేశం ప్రసిద్ధి. భారతదేశం లాంటి అతిపెద్ద దేశంలో ప్రతి వర్గం యొక్క ప్రయోజనాలని ప్రజాస్వామ్యబద్ధంగా కాపాడుతూ అందరినీ కలుపుకుపోవడానికి ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న శిఖరసమానమైన ప్రయత్నాలు అద్భుతంగా, బాధ్యతాయుతంగా ఉన్నాయి.

ప్రజల మధ్య వచ్చే అపార్ధాల వల్ల జరిగే ఆమోదనీయం కాని సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడా, అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటాయి. భారత్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. కానీ కొందరు అలాంటి సంఘటనలకు అనవసర ప్రాధాన్యత కల్పిస్తూ ప్రజల మధ్య ఉన్న సామరస్య వాతావరణాన్ని ఉద్దేశ్యపూర్వకంగా దెబ్బతీస్తున్నారు. మనం ఆ ఉచ్చులో చిక్కుకోకుండా సంఘటితంగా ఉంటూ దేశాభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ప్రభుత్వానికి సహకరించాలి.

దేశవ్యాప్తంగా ప్రతికూల భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు హేతువాదుల ముసుగులో కొందరు చేస్తున్న ప్రయత్నాలను దేశ ప్రజలు సహించరు. దేశంలోని ఆరోగ్యకర, శాంతియుత, సామరస్య వాతావరణాన్ని పాడు చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.” అని పేర్కొన్నారు.

మొత్తమ్మీద అసహనం అని, మూక దాడులని కుహనా మేథావులు చేస్తున్న విష ప్రచారాన్ని నిరసిస్తూ విద్యావేత్తలు, రచయితలు, కళాకారులు, వైద్యులు, జర్నలిస్టులు, న్యాయవాదులతో కూడిన మేథావుల బృందం ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేసింది.