
407views
ప్రపంచాన్ని వణికించిన అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ చీఫ్ బిన్‌లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ చనిపోయాడని అమెరికా ప్రకటించింది. బిన్‌లాడెన్ మరణం తర్వాత అల్ ఖైదాలో ఆయన కుమారుడు హమ్జా బిన్ లాడెన్ కీలకనేతగా ఎదుగుతూ వచ్చాడు. తండ్రి మరణానికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాడని కూడా గతంలో అమెరికాకు వార్నింగ్ పంపాడు. అయితే అతడు చనిపోయాడని, అమెరికానే అతన్ని హతమార్చినట్టు అమెరికన్ మీడియా తెలిపింది. తండ్రి మృతి తర్వాత అల్ ఖైదాకు వారసుడిగా ఉన్న హమ్జా మృతికి సంబంధించి తమ వద్ద పక్కా సమాచారం ఉందని ఎన్‌బీసీ వార్తా సంస్థ వెల్లడించింది. హమ్జా మృతిని అమెరికా అధికారులు కూడా ధృవీకరించినట్టు తెలిపింది. హమ్జా బిన్ లాడెన్‌ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన అమెరికా అతడిపై మిలియన్ డాలర్ల రివార్డును కూడా ప్రకటించింది.