పర్యావరణంలో ప్రతికూల మార్పుల ప్రభావం దక్షిణాసియాలో అత్యంత కీలకమైన గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతాలపై పడుతోందని తాజా నివేదిక ఒకటి తెలిపింది. సత్వరం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే దాదాపు వంద కోట్లమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నివేదిక ప్రకారం- హిందుకుష్ హిమాలయాల్లోని మంచు, హిమానీనదాలు, అక్కడ కురిసే వర్షపాతమే ఆసియాలోని 10 అతిపెద్ద నదీ వ్యవస్థలకు మూలాధారాలు. గంగా బేసిన్ వల్ల భారత ఉపఖండంలో 60 కోట్లకు పైగా మంది ప్రయోజనాలు పొందుతుంటారు. అయితే పారిశ్రామికీకరణ, నగరీకరణ చాలా వేగంగా చోటుచేసుకుంటుండటంతోపాటు వ్యవసాయ విధానాల్లో అనుచిత మార్పుల కారణంగా ఈ నదీ వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. నదీజలాల్లోకి పారిశ్రామిక వ్యర్థాలను ఇష్టారీతిన విడుదల చేస్తుండటం మానవ, పర్యావరణ ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతోంది. వర్షాకాలంలో వరద విలయాలు, వేసవిలో తీవ్రస్థాయి నీటి కొరత కనిపిస్తున్నాయి. భారత్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, చైనాల్లో 26.8 కోట్లకుపైగా మందికి జీవరేఖగా భావించే సింధూ నది విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పర్యావరణ మార్పులతోపాటు డ్యాంల నిర్మాణం, అభివృద్ధి పనులు మితిమీరుతుండటం వల్ల బ్రహ్మపుత్ర బేసిన్లోనూ (ముఖ్యంగా దిగువ బేసిన్లో) వరదలు, కరవు ముప్పు పెరుగుతోంది.
389views
You Might Also Like
భూమిపై తొలి జీవం భారత్‌లోనే పుట్టిందా?
33
భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించిన అత్యంత ప్రాచీన ఆధారాలను భారతీయ భూగర్భ శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. జార్ఖండ్‌లోని సింగ్భూమ్ క్రేటన్ శిలల్లో సుమారు 350 కోట్ల (3.5...
పాకిస్తాన్ కుట్రల బారిన పడకుండా గురుద్వారాల ద్వారా ISI ప్రమాదాలపై అవగాహన
30
పాకిస్తాన్ తన దుష్టచర్యలను మానడం లేదు. పంజాబ్‌లో ఉగ్రవాదాన్ని, యువతను మత్తుపదార్థాలకు బానిసలుగా చేసే కుట్రలు చేస్తోంది. దీనిని తిప్పికొట్టడానికి పంజాబ్‌లోని సిక్కు సమాజం పాకిస్తాన్‌పై పోరాటం...
స్వామి లక్ష్మణానంద శత జయంతి వేడుకలు ప్రారంభం
17
భువనేశ్వర్ : మత ఛాందసుల చేతిలో ఘోరంగా హత్యకు గురైన స్వామి లక్ష్మణానంద శత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆయన జన్మస్థలమైన గురుజంగ్ కేంద్రంగా ఇవి ప్రారంభమయ్యాయి....
పాక్ సైన్యంపై సొంత దేశంలోనే విమర్శలు.. 1971 ఓటమిని గుర్తుచేసిన ఫజ్లుర్ రెహమాన్
37
పాకిస్థాన్ సైన్యానికి సొంత దేశంలోనే విమర్శలు ఎదురవుతున్నాయి. భారత్‌ను ఉద్దేశించి అప్పటి పాక్ సైన్యాధ్యక్షుడు యాహ్యా ఖాన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ జమైత్ ఉలేమా-ఇ-ఇస్లాం (ఎఫ్) అధినేత...
లవ్ జీహద్ బాధితురాలు.. ఇస్లాం మతోన్మాదానికి బలైన సౌజన్య రాసిన సూసైడ్ లెటర్..
43
రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ పిఠాపురం ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య రాసిన సూసైడ్ లెటర్ వెలుగులోకి వచ్చింది. ‘సాధిక్’ అనే వ్యక్తి తమ...
అయోధ్యలో చేపల విందుపై వివాదం.. శ్రావణ మాసంలో ఇదేం పని అంటూ సాధువుల ఆగ్రహం
40
అయోధ్య: పవిత్ర శ్రావణ మాసంలో అయోధ్యలో చేపల విందు ఏర్పాటు చేయడం వివాదానికి దారితీసింది. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ అయోధ్య పర్యటన సందర్భంగా నిర్వహించిన...





