News

హిందువు భారతదేశానికి ప్రాథమిక ఆత్మ : యోగి ఆదిత్యనాథ్

245views

రాజ్యాంగం కంటే షరియత్ పెద్దది కాదని ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ఈ దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తుందని గుర్తు చేశారు. ముస్లింలు దేశంలో ఇళ్లు సహా అనేక పథకాలను పొందుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి క్రమంలో భారతదేశ చట్టాలను కూడా అనుసరించాలని స్పష్టం చేశారు.

ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. షరియత్ మీ వ్యక్తిగత అంశం కావచ్చు, కానీ అది రాజ్యాంగానికి అతీతమైనది కాదని అన్నారు. మరోవైపు మదర్సాలను కూడా ఆధునీకరిస్తున్నామని చెప్పారు. మనకు శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరమని పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగానే మన విద్యా సంస్థలను తీర్చిదిద్దుతామని అన్నారు.

హిందువు భారతదేశానికి ప్రాథమిక ఆత్మ అని, వారిని అవమానించవద్దని సూచించారు. సెంటిమెంట్‌ను కించపరిచే రాజకీయాలు చేయోద్దని హితవు పలికారు. దేశ భద్రత, హిందూ విశ్వాసం పట్ల మనం రాజీ పడలేమన్నారు. 2017కి ముందు అయోధ్య, ఇప్పుడు అయోధ్య మధ్య అవకాశాలు 100 రెట్లు పెరగాయని చెప్పారు. లక్షల మందికి ఉపాధి లభించిందని తెలిపారు. భగవంతుని దయ అందరికీ అండాలని ఆకాంక్షించారు.