News

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు పటిష్ట బందోబస్తు

269views

ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్‌ఈబీ అడిషనల్‌ ఎస్పీ వెంకటరాముడు అన్నారు. ఒంటిమిట్ట ఆలయ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను కడప డీఎస్పీ షరీఫ్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఆలయ, కళ్యాణ వేదిక పరిసరాలను, ట్రాఫిక్‌ మళ్లింపుగల లింక్‌ రోడ్లను వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట సీఐ పురుషోత్తం రాజు, ఎస్‌ఐ మధుసూదన్‌ రావు, ఒంటిమిట్ట టీటీడీ విజిలెన్సు అధికారి, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.