
291views
మంత్రాలయంలో ఏకాదశి సందర్భంగా రాఘవేంద్ర స్వామి గురువారం భక్తులకు నిజ బృందావన రూపంలో దర్శనమిచ్చారు. గురువారం శ్రీమఠంలో నిత్య పూజలకు విరామం ఇచ్చారు. నిర్మాల్యం మాత్రమే చేసి కాషాయ వస్త్రాలు, తులసిమాలతో బృందావనాన్ని అలంకరించారు. పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు నిజ బృందావనానికి హారతి ఇచ్చారు.





