News

ఖాద్రీశుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

244views

అనంతపురం జిల్లా కదిరిలోని ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు మంగళ వారం అంకురార్పణ చేశారు. మంగళ వాయిద్యాల మధ్య నారసింహుడు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఆలయానికి నైరుతి దిశలో ఉన్న మండపానికి చేరుకున్నారు. అర్చక పండితులు నిర్ణీత ప్రదేశంలో ‘భూమిపూజ’తో పుట్టమన్ను సేకరించి, ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. యాగశాలలో ఆ మట్టితో నింపిన 9 పాలిక(కుండ)ల్లో నవ ధాన్యాలతో అంకురార్పణ చేశారు.

నేడు ఖాద్రీశుని కల్యాణోత్సవం
లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన శ్రీవారి కల్యాణోత్సవం బుధవారం రాత్రి 9.30 గంటలకు వైభవంగా జరగనుంది. ఇందుకోసం ఆలయ అధికారులు, అర్చకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కలెక్టర్‌ అరుణ్‌బాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇప్పటికే పట్టణానికి నలువైపులా స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని, పరిసరాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. ఇక శ్రీవారి కల్యాణోత్సవాన్ని జరిపించేందుకు టీటీడీ తరఫున కొందరు అర్చక పండితులు హాజరు కానున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.