NewsProgramms

విద్యాభారతి అధ్వర్యంలో అధ్యాపకులకు కార్యశాల.

120views

రాయలసీమ సమితి అధ్వర్యంలో అనంతపురం, కర్నూలు, కడప,చిత్తూరు నాలుగు జిల్లాలకు చెందిన అధ్యాపకులకు వేద గణితము, వైజ్ఞానిక విషయాలకు సంబంధించి జ్ఞాన విజ్ఞాన మేళా, బాల బాలికల్లో నైతిక వర్తనను పెంపొందించే  నైతిక ఆధ్యాత్మిక అంశాలు, భారతీయ సంస్కృతికి సంబంధించి సంస్కృతి మహోత్సవ కార్యశాల జరిగింది. జూలై 28  2019 ఆదివారము నాడు శ్రీ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలోని శ్రీసరస్వతీ విద్యా మందిరం ఆవాస విద్యాలయం కర్నూలు నందు జరిగిన ఈ కార్యశాలలో విద్యా భారతి క్షేత్ర సేవ ప్రముఖ్ శ్రీ కుందూరు విద్వాన్ రెడ్డి, హైదరాబాద్, నైతిక ఆధ్యాత్మిక ప్రముఖ్ శ్రీ  ఓరుగంటి సీతారామ మూర్తి, కాకినాడ, స్టేట్ రిసోర్స్ పర్సన్ శ్రీ నరేంద్ర, విజయవాడ, జ్ఞాన విజ్ఞాన మేళా ప్రముఖ్ శ్రీ ఆలీ, అడ్డాడ, అనంతపురం,  సమితి సహ కార్యదర్శి శ్రీ విజయానంద్ లు పాల్గొని నాలుగు జిల్లాలలోని  వివిధ పాఠశాలల నుండి హాజరయిన ప్రతినిధులకు ఆ అంశాలపై అవగాహన కలిగించారు.