NewsProgramms

సైనికుల త్యాగాల గాలిలో త్రివర్ణపతాకం ఎగురుతోంది – శ్రీ దూసి రామకృష్ణ

203views

భారత వీర సైనికుల త్యాగాల గాలిలో త్రివర్ణపతాకం ఎగరగలుగుతోందని ఆరెస్సెస్ సహ క్షేత్ర (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక) సంఘచాలక్ శ్రీ దూసి రామకృష్ణ అన్నారు. శ్రీకాకుళం జిల్లా బలగలో ప్రారంభమైన ఆరెస్సెస్ నూతన కార్యాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సమాజంలో వ్యక్తి నిర్మాణమే లక్ష్యంగా ఆరెస్సెస్ పని చేస్తున్నదని శ్రీ రామకృష్ణ తెలిపారు. ఆరెస్సెస్ కి ఇప్పుడు సర్వత్రా అనుకూల వాతావరణం నిర్మితమై వున్నదని, దేశ సరిహద్దుల్లో సైనికులు దేశానికి కాపలాగా వుంటే దేశం లోపల స్వయంసేవకులు దేశాన్ని అన్ని విషయాలలో రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. సైనికుల త్యాగాల స్ఫూర్తితో ప్రతి భారతీయుడు ఓ సైనికుడిలా మారి దేశాన్ని సంరక్షికోవాలని శ్రీ రామకృష్ణ ఉద్బోధించారు.

విభాగ్ సంఘచాలక్ శ్రీ డీవీవీ కృష్ణంరాజు మాట్లాడుతూ కార్యాలయం అంటే కార్యానికి ఆలయమని, అలాంటి ఆలయాన్ని మనం నేడు నిర్మించుకున్నామని, ఈ కార్యాలయం కేంద్రంగా కార్య వృద్ధి జరగాలని తెలిపారు.

అదే రోజు “కార్గిల్ విజయ దివస్” కూడా కావటంతో శ్రీకాకుళం జిల్లాకు చెందినా కార్గిల్ వీరులను కూడా సన్మానించారు.  శ్రీకాకుళం జిల్లా సోంపేట నివాసి శ్రీ జయకృష్ణ మాతృభూమి రాక్షణకోసం కార్గిల్ యుద్ధంలో మొదటి 5రోజులు పోరాటం చేసి కుడిచెయ్యి, ఎడమకన్ను కోల్పోయిన క్షతగాత్రుడు. ప్రస్తుతం స్థానిక జూనియర్ కాలేజ్ లో అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. ఆరెస్సెస్ లో  వారం రోజుల శిక్షణ (ప్రాథమిక శిక్షావర్గ) పూర్తిచేసి, మండల ప్రచార ప్రముఖ్ గా బాధ్యత కూడా నిర్వహిస్తున్నారు.

కార్గిల్ లో పోరాటం చేసిన మరో వీరుడు కవిటి మండలానికి చెందిన శ్రీ గిరిధర్ గారిని కూడా ఈ సందర్భంగా  సన్మానించడం జరిగింది. స్థానిక శాసన సభ్యులు శ్రీ ధర్మాన ప్రసాదరావు గారు ఫోన్ ద్వారా వారి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మొత్తం 500 మంది పాల్గొన్నారు.