
370views
అన్ని మండలాలు, అన్ని ఖండాలు, అన్ని నగరాలకు ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకొని ముందుకు సాగాం. ఒక ఖండంలోని అన్ని మండలాల్లో సంఘ్ కార్యాలు నిర్వహించేందుకు నిత్య శాఖ, సాప్తాహిక మిలన్ ఉండాలని సంకల్పించామని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్,సర్ కార్యవాహ దత్తాత్రేయహోసబాలే జీ పేర్కొన్నారు. నాగపూర్‌లో జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభ-2024 మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2025 విజయదశమి నుంచి శతాబ్ది సంవత్సరం ప్రారంభం అవుతుందన్నారు.సంఘ్ శతాబ్ది సంవత్సరం నిమిత్తం సంఘటనాత్మక దృష్టి కోణం నుంచి పనుల గురించి ఆలోచించడం జరిగిందని వచ్చే ఏడాదికల్లా ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని తెలిపారు.





