News

అమెరికాలో హిందూ పూజారిపై దాడి

102views

అమెరికాలో ఓ హిందూ పూజారిపై దాడి జ‌రిగింది. అమెరికాలోని గ్రీన్‌ ఓక్స్‌ ప్రాంతంలోని శివ శక్తి పీఠంలో పూజారిగా ఉన్న హరీశ్ చందర్ పూరి న‌డుచుకుంటూ వెళ్తుండ‌గా, వెనుక నుంచి వ‌చ్చిన ఓ వ్య‌క్తి పూజారిని చిత‌క‌బాదాడు. అయితే శివ శ‌క్తి పీఠం సమీపంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. ఈ ఘటనలో స్వామీజీకి గాయాలు కాగా, ఆయన‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి సెర్జియ గువెయ (52)గా గుర్తించిన పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ దాడిని విద్వేష దాడని, స్వామీజీని లక్ష్యంగా చేసుకుని ఇది జరిగిందని ఆయన శిష్యులు అనుమానం వ్య‌క్తం చేశారు. దాడికి పాల్పడే ముందు సెర్జియ, ఇది తమ ప్రాంతమని నినాదాలు చేసినట్టు తెలుస్తోంది. గాయాల నుంచి తాను నిదానంగా కోలుకుంటున్నానని, తనపై దాడికి దిగిన వ్యక్తి కోసం కూడా ప్రార్థిస్తానని హరీశ్ చందర్ వ్యాఖ్యానించారు.

Source : Bharath Today.