
1.1kviews
సేవాభారతి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా పీలేరులో స్థానిక సి. ఎన్. ఆర్ డిగ్రీ కళాశాలలో 19/7/2019 శుక్రవారం నాడు రక్తదాన శిబిరం జరిగినది.
రెడ్ క్రాస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం. వి. నారాయణ రెడ్డి, వారి బృందం దాతల నుంచి రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో 47 మంది స్వయంసేవకులు పాల్గొని రక్తదానం చేశారు. వారిలో ఆరెస్సెస్ జిల్లా, విభాగ్ కార్యకర్తలు కూడా ఉన్నారు. ఈ కార్యక్రమానికి కాలేజీ ప్రిన్సిపాల్ రవిశేఖర్ రెడ్డి , డైరెక్టర్ లావణ్య, కరెస్పాండంట్ చింతల విజయ భాస్కర్ రెడ్డి , పీలేరు సేవా భారతి అధ్యక్షులు ఎం . శశిధర్ రెడ్డి మరియు అధ్యాపక బృందం , విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






