News

బంగ్లాదేశ్లో 3.7 కోట్ల మంది మైనారిటీలు గల్లంతు.

114views

“హిందూ, బౌద్ధ, క్రైస్తవ యునైటెడ్ ఫోరం (HBCUC)” ప్రియా సాహా జూలై 19న వైట్ హౌసులో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను కలిసిన సందర్భంగా బంగ్లాదేశ్లోని మైనారిటీల దుస్థితిపై డోనాల్డ్ ట్రాంప్ కు వివరిస్తూ తమ దేశంలో 3.7 కోట్ల మంది మైనారిటీలు గల్లంతైనట్లు ఆయనకు ఫిర్యాదు చేశారు.

అమెరికా అధ్యక్షునితో ఆమె ఈ విషయాన్ని చెబుతున్న వీడియో బంగ్లాదేశ్లో కలకలం సృష్టిస్తోంది. ఈ విషయం బంగ్లాదేశ్ ప్రభుత్వము మరియు బంగ్లాదేశ్లోని కొన్ని వర్గాల వారు తమకు గట్టి ఎదురు దెబ్బగా భావిస్తున్నారు. ప్రియా సాహాను విచారించి, ఆమెపై దేశ ద్రోహ నేరాన్ని మోపనున్నట్లు  బంగ్లాదేశ్ మంత్రి ఒబైదుల్ ఖాదర్ తెలియజేశారు.

ఆమె నేతృత్వం వహిస్తున్న సంస్థ HBCUC కూడా ఆమెకు అండగా నిలిచేందుకు సిద్దంగా ఉన్నట్టు కనబడడం లేదు. “ ఆమె చేసిన వ్యాఖ్యలు తమను నిర్ఘాంతపోయేలా చేశాయని, అది ఆమె స్వంత అభిప్రాయమని, వాటితో తమకు సంబంధం లేదని సంస్థ ప్రతినిధి కాజల్ దేవనాథ్ అన్నారు.