News

భారత్-జపాన్ సేనల సంయుక్త విన్యాసాలు ప్రారంభం

302views

భారత్ జపాన్ ల సంయుక్త సైనిక విన్యాసాలు ఆదివారం ప్రారం భమయ్యాయి. ‘ధర్మ గార్డియన్’ పేరిట నిర్వహిస్తున్న ఈ యు యుద్ధక్రీడలు మార్చి 9 వరకూ కొనసాగుతాయి. రాజస్థాన్ లోని స్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఇందుకు వేదికైంది. ఇరుదేశాల నుంచి 40 మంది చొప్పున సిబ్బంది ఈ విన్యాసాల్లో పాల్గొంటారు. జపాన్ బృందంలో ఆ దేశానికి చెందిన 34వ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ సభ్యులు, భారత్ తరపున రాజ్యపు తానా రైఫిల్స్ సైనికులు పాలుపంచుకుంటున్నారు. ఇరుదేశాల మధ్య సైనిక సహకారాన్ని పెంపొందించుకోవడమే ఈ విన్యాసాల లక్ష్యం.