
792views
వేద మంత్రోచ్చరణలతో మార్మోగిన ప్రాంతమది. భక్తులు, సందర్శ కులు పవిత్ర సంగమంలో స్నానాలు ఆచరించి, పంచ హారతులు అందుకొన్న పుణ్య స్థలం నేడు.. చెత్తతో నిండిపోయింది. పవిత్ర సంగమంలో పాకుడు దర్శనమిస్తోంది. ఘాట్లలో మద్యం సీసాలు కని పిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద గోదావరి, కృష్ణా సంగమం ప్రదేశం ఉంది. ఇక్కడి నుంచి గతంలో నదులకు నిత్యం పంచహారతులు ఇచ్చేవారు. చూసేందుకు భక్తులు, సందర్శకులు వచ్చేవారు.కానీ ఇప్పుడు ఆ పంచహారతులు బంద్ అయ్యాయి. ఈ ప్రదేశం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. నిర్వహణ లేకపోవడంతో ఘాట్లు దెబ్బతిన్నాయి. ఎక్కడ చూసినా మద్యం సీసాలే దర్శనమిస్తున్నాయి.






