
248views
తిరుమల తిరుపతి దేవస్థానం పలు సేవలకు సంబంధించిన టోకెన్లను ఆన్ లైన్ ద్వారా ఈరోజు విడుదల చేసింది. శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించిన మే నెల ఆన్ లైన్ కోటాను టిటిడి ఈరోజు విడుదల చేసింది. అలాగే అంగ ప్రదక్షిణం టోకెన్లను కూడా ఆన్ లైన్ ద్వారానే విడుదల చేశారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు ఆన్ లైన్ ద్వారా టిటిడి టోకెన్లను విడుదల చేయనుంది. అలాగే రేపు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా కూడా విడుదల కానుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్ లైన్ ద్వారా టోకెన్లను పొందాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.





